ప్రతి వినాయకుడికి రూ.2,016 విరాళం సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు
అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 18, రామగిరి డెస్క్:
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతి వినాయక విగ్రహానికి తన వంతుగా రూ.2,016 చొప్పున విరాళం అందించనున్నట్లు సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఈ చిరు కానుకను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
వినాయకుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శుక్రవారం రత్నాపూర్ గ్రామంలోని బేగంపేట ఎక్స్‌రోడ్డు వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం, రాంనగర్‌లోని బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహం, గొల్లవాడలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.